చిత్తూరు జిల్లాలో మూడున్నర నెలల క్రితం ఓ చిన్నారిపై అత్యాచారం జరిపి హత్య చేసిన మహ్మద్ రఫీకి జిల్లా సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. గత నవంబర్ 7న ఓ వివాహంకోసం కుటుంబంతో కలసి కురబలకోట వెళ్లిన ఆరేళ్ల చిన్నారిని రఫీ కళ్యాణ మండపం సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు అభియోగం. నేరం జరిగాక నాలుగు రోజుల్లో నిందితుడిని పట్టుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. కోర్టు సత్వర విచారణను చేపట్టి 47 మంది సాక్షులను విచారించింది.
2020-02-24సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరిట తీసుకున్న రుణం తిరిగి చెల్లించనందుకు గాను ఎం.పి. సుజనా చౌదరి ఆస్తుల వేలానికి బ్యాంకు నోటీసు ఇచ్చింది. రూ. 400 కోట్ల రుణం ఎగవేతకు సంబంధించి.. చౌదరి సహా 10 మంది గ్యారంటీర్లుగా ఉన్నారు. మార్చి 23న వారి ఆస్తులను వేలం వేయనున్నట్టు చెన్నై బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ బ్రాంచ్ గురువారం పత్రికల్లో ప్రకటించింది. ఆసక్తి ఉన్నవాళ్లు మార్చి 20న ఆస్తులు తనిఖీ చేసుకోవచ్చని, ఆ తర్వాత రోజే బిడ్లు దాఖలు చేయాలని ఇ-ఆక్షన్ నోటీసులో సూచించింది.
2020-02-20మహిళలపై నేరాల నియంత్రణకు నియమితురాలైన ‘దిశ’ ప్రత్యేక అధికారి ఎం. దీపిక (ఐపిఎస్)కు ప్రమోషన్ లభించింది. ఇప్పటిదాకా ఆమె సిఐడి అదనపు డీజీ కార్యాలయంలో అదనపు ఎస్పీ హోదాలో ‘దిశ’ ప్రత్యేక అధికారిగా ఉన్నారు. ఆమెకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా ప్రమోషన్ ఇస్తూ మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో దిశ ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ జీవో ఆర్టీ నెంబర్ 336 జారీ చేశారు.
2020-02-192012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో దోషులను మార్చి 3 ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని తాజాగా ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు మరో డెత్ వారెంట్ జారీ చేసింది. దోషులు ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ సింగ్ లను ఫిబ్రవరి 1న ఉరి తీయాలని జనవరి 17నే కోర్టు డెత్ వారెంట్ జారీ అయింది. అయితే, వినయ్ శర్మ, అక్షయ్ క్షమాబిక్ష పిటిషన్లు పెండింగ్ లో ఉండటంతో జనవరి31న ట్రయల్ కోర్టే ఉరిపై స్టే ఇచ్చింది. తర్వాత ఫిబ్రవరి 5న ఢిల్లీ హైకోర్టు దోషులకు ఇచ్చిన వారం గడువు కూడా ముగియడంతో తాజా వారెంట్ జారీ అయింది.
2020-02-18భారత ప్రభుత్వం ఆర్మీలో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలను నిరాకరించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘కమాండ్ పోస్టింగ్స్’ ఇవ్వకపోవడానికి శారీరక పరిమితులు, సామాజిక బాధ్యతలను కారణాలుగా చూపడాన్ని తప్పు పట్టింది. మహిళలకూ ‘పర్మనెంట్ కమిషన్’ ఇవ్వాలన్న 2010 ఢిల్లీ హైకోర్టు తీర్పుపై కేంద్రం అభ్యంతరాలను జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ అజయ్ రస్తోగిలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. తన తీర్పును అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి 3 నెలల గడువు ఇచ్చింది.
2020-02-17 Read More‘‘ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్ఛను హరించజాలదు.. రాజ్యాంగ ధర్మాసనాలు ప్రజల రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తాయి. ఇది పాకిస్తాన్, ఇండియా కాదు’’- ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అథర్ మినల్లా వ్యాఖ్యలివి. పాకిస్తాన్ లోని పస్థూన్ తహఫుజ్ మూమెంట్ (పిటిఎం), అవామి వర్కర్స్ పార్టీ (ఎడబ్ల్యుపి) కార్యకర్తల బెయిల్ పిటిషన్లపై నిర్ణయం అనంతరం సోమవారం న్యాయమూర్తి ఇండియా ప్రస్తావన తెచ్చారు. అనుమతి తీసుకొని నిరసన తెలపాలని, ఇవ్వకపోతే కోర్టులు ఉన్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు.
2020-02-17 Read Moreఏపీ మాజీ డీజీపీ ఎ.బి. వెంకటేశ్వరరావు సస్పెన్షన్ నిలిపివేతకు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) నిరాకరించింది. ఏబీ దాఖలు చేసిన పిటిషన్ పై ‘క్యాట్’ శుక్రవారం విచారణ చేపట్టింది. డీజీపీ స్థాయి అధికారిని సస్పెండ్ చేస్తే కేంద్రానికి సమాచారం ఇచ్చారా? మే నెల నుంచి ఏబీకి వేతనం ఎందుకు ఇవ్వలేదు? అని ‘క్యాట్’ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కౌంటర్ దాఖలుకోసం ప్రభుత్వానికి గడువు ఇస్తూ.. విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈలోగా సస్పెన్షన్ పై స్టే ఇవ్వాలన్న ఏబీ తరపు న్యాయవాది విన్నపాన్ని తోసిపుచ్చింది.
2020-02-142012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో దోషిగా తేలిన వినయ్ శర్మ విన్నపాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. తన మానసిక పరిస్థితి సరిగా లేదన్న వాదనను సుప్రీం కొట్టిపారేసింది. వినయ్ వైద్య పరీక్షల నివేదికల్లో అంతా సాధారణంగానే ఉందని పేర్కొంది. వినయ్ శర్మ క్షమాబిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తిరస్కరించిన నేపథ్యంలో దోషి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. రాష్ట్రపతి నిర్ణయంపై శర్మ చేసిన విన్నపాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది.
2020-02-14సిఎం జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగించాలన్న పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. వివేకా కుమార్తె సహా పలువురు వేసిన పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టింది. అయితే, అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేకపోవడంతో విచారణను వాయిదా వేశారు. ఎన్నికలకు ముందు సీబీఐ విచారణ కోరిన ప్రస్తుత సిఎం జగన్, ఇప్పుడు వైఖరి మార్చుకున్నారు. అయితే, వివేకా కుమార్తె తన పిటిషన్లో రక్త సంబంధీకులతో సహా పలువురిపై అనుమానం వ్యక్తం చేశారు.
2020-02-13లక్నో కోర్టు ఆవరణలో ఓ లాయర్ లక్ష్యంగా విసిరిన నాటు బాంబు తాకిడికి ఇద్దరు గాయపడ్డారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి కిలోమీటరు దూరంలో జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి సమీపంలో ఈ దాడి జరిగింది. సంజీవ్ లోధి అనే న్యాయవాదిపై బాంబు విసిరారు. ఆయన మరో లాయర్ జీతు యాదవ్ దీనికి బాధ్యుడని ఆరోపించారు. ఈ ఘటన తర్వాత మరో మూడు బాంబులను పోలీసులు కనుగొన్నారు.
2020-02-13