బీమా కోరెగావ్ ఘర్షణలకు సంబంధించి నమోదైన 649 కేసుల్లో 348 కేసులను, మరాఠా రిజర్వేషన్ ఆందోళనల్లో హింసపై నమోదైన 548 కేసుల్లో 460 కేసులను మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉపసంహరించుకుంది. మహా వికాస్ అఘాది ప్రభుత్వంలో హోం శాఖ మంత్రిగా ఉన్న ఎన్.సి.పి. నేత అనిల్ దేశ్ ముఖ్ ఈ విషయాన్ని వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆమోదంతో.. ఎల్గార్ పరిషద్ కేసును పూణె పోలీసుల నుంచి ఎన్.ఐ.ఎ.కు బదిలీ చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్.సి.పి. ఖండించింది.

2020-02-27 Read More

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్పొరేటర్ తాహిర్ హుస్సేన్ పైన ఢిల్లీ పోలీసులు గురువారం హత్య, దహనాల కేసులు నమోదు చేశారు. ఢిల్లీ అల్లర్లలో ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్ అంకిత్ శర్మ మరణించారు. తాహిర్ హుస్సేన్ భవనం పైనుంచి జరిగిన రాళ్ళ దాడితోనే అంకిత్ శర్మ మరణించారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాహిర్ పైన హత్య కేసు నమోదైంది. మొన్న (ఫిబ్రవరి 25న) అదృశ్యమైన అంకిత్ శర్మ మృతదేహం నిన్న మురికి కాల్వలో లభ్యమైన విషయం తెలిసిందే.

2020-02-27

‘‘మధ్యప్రదేశ్ లోని ‘కోట్మ’లో 11వ తరగతి చదువుతున్న ఓ అమ్మాయి ప్రాక్టికల్ పరీక్ష రాసి బయటకు రాగానే కాపు కాచి ఉన్న 25-26 సంవత్సరాల ముస్లిం కత్తితో ఆమె మెడపై నరికాడు. అతని జీహాదీ ప్రేమను అంగీకరించకపోవడమే కారణం’’ అనే ‘కథ’నం తాజాగా సామాజిక మాథ్యమాల్లో కనిపిస్తోంది. నిజానికి ఆ ఫొటోలు 2018 ఫిబ్రవరిలో ‘కోట్మ’లో జరిగిన హత్యకు సంబంధించినవి. పూజ పనిక అనే 17 ఏళ్ళ అమ్మాయిని విజయ్ ప్రజాపతి అనే వ్యక్తి చంపినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. మరుసటి రోజే ప్రజాపతి ఆత్మహత్య వార్తలూ వచ్చాయి. ఇక్కడ మతం లేదు. జీహాదీ లేదు.

2020-02-27 Read More

ఢిల్లీలో దాడులకు గురై ఓ చిన్న ఆసుపత్రిలో చిక్కుకున్న బాధితులకోసం అర్దరాత్రి తన ఇంటినే కోర్టుగా మార్చిన న్యాయమూర్తి.. 1984 ఘటనలను పునరావృతం కానివ్వబోమన్న ధీశాలి.. జస్టిస్ మురళీధర్ హఠాత్తుగా బదిలీ అయ్యారు. బదిలీ ప్రతిపాదన కొద్ది రోజుల క్రితం చేసిందే అయినా.. బుధవారం రాత్రికి రాత్రి రాష్ట్రపతి నోటిఫికేషన్ (పంజాబ్-హర్యానా హైకోర్టుకు బదిలీ చేస్తూ) జారీ చేయడం ఆశ్చర్యకరం. ఢిల్లీ హత్యాకాండపై విచారణ కోరినవారి విన్నపాన్ని ఢిల్లీ హైకోర్టు వినబోతున్న తరుణంలో.. జరిగిన ఈ బదిలీ సాధారణం కాదు.

2020-02-26

మతోన్మాదం ఢిల్లీని తగలబెడుతోంది. ఖజూరికాస్ ప్రాంతానికి 1.5 కిలోమీటర్ దూరంలో గామ్రి ఎక్స్టెన్షన్లో ఓ 85 ఏళ్ల మహిళ (అక్బారి)ని సజీవ దహనం చేశారు ఉన్మాద మూక. ‘జై శ్రీరాం’ నినాదాలు చేస్తూ ఓ 100 మంది గుంపు మంగళవారం ఆ ప్రాంతంలో చెలరేగిపోయారు. ముస్లింల ఇళ్లు, షాపులు లక్ష్యంగా దాడులు చేశారు. ఈ క్రమంలోనే రెడీమేడ్ వస్త్రాల వ్యాపారి మహ్మద్ సయాద్ సల్మాని భవనానికి నిప్పు పెట్టారు. నాలుగు అంతస్థుల ఆ భవనం మూడో అంతస్తులో ఉన్న సల్మాని తల్లి అక్బారి మంటల్లో చిక్కుకొని చనిపోయారు.

2020-02-26 Read More

‘‘సరైన సమయం అంటే ఎప్పుడు మిస్టర్ మెహతా?! నగరం తగలబడుతోంది’’- విద్వేష ప్రసంగాలపై ఎఫ్.ఐ.ఆర్.లు నమోదు చేయకపోవడం పట్ల ఢిల్లీ హైకోర్టు భారత సొలిసిటర్ జనరల్ (ఎస్.జె)కు వేసిన ప్రశ్న ఇది. పిటిషనర్లు కేవలం మూడు వీడియో క్లిప్పులను మాత్రమే సమర్పించడాన్ని ప్రశ్నించిన ఎస్.జె, కేసు నమోదుకు ఇది సమయం కాదని వాదించారు. ఆ వాదనను కొట్టిపారేసిన జస్టిస్ మురళీధర్ ‘‘ఆస్తుల ధ్వంసంపై ఎఫ్.ఐ.ఆర్.లు నమోదు చేసినవారు.. ఈ ప్రసంగాలపై ఎందుకు చేయడంలేదు? మీరు ఆ నేరాన్నే గుర్తించడంలేదా?’’ అని ప్రశ్నించారు.

2020-02-26 Read More

ఢిల్లీ హత్యాకాండలో ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్ ఒకరు ప్రాణాలు కోల్పాయారు. అంకిత్ శర్మ అనే ఆ యువ అధికారి మృతదేహాన్ని బుధవారం ‘చాంద్ బాగ్’లోని ఓ మురికి కాల్వలో కనుగొన్నారు. శర్మ 2017లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరారు. చాంద్ బాగ్ ప్రాంతంలో నివశిస్తున్న అంకిత్ శర్మ, మంగళవారం సాయంత్రం అల్లర్లు జరుగుతున్న వేళ ఇంటికి వస్తుండగా దుండగులు దాడి చేసినట్టు సమాచారం. అప్పటినుంచి ఆయన కనిపించడంలేదు. అంకిత్ తండ్రి రవీందర్ శర్మ కూడా ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేశారు.

2020-02-26

మూడు రోజుల క్రితం బిజెపి నేత కపిల్ మిశ్రా చేసిన విద్వేష ప్రసంగం వీడియోను ఢిల్లీ హైకోర్టు బుధవారం వీక్షించింది. హింసాకాండకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్ లపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్. మురళీధర్, జస్టిస్ తల్వంత్ సింగ్.. పోలీసుల ప్రేక్షక పాత్రపై చీవాట్లు పెట్టారు. దాడులకు ప్రేరేపించినవారిని వదిలేయకపోయి ఉంటే పరిస్థితి తీవరించేది కాదని వారు వ్యాఖ్యానించారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ తరపున హాజరయ్యానన్న భారత సొలిసిటర్ జనరల్ (ఎస్.జి)పై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.

2020-02-26 Read More

ఢిల్లీ హింసాకాండలో గాయపడిన 22 ముస్లింలను ముస్తఫాబాద్ లోని చిన్న క్లినిక్ నుంచి పెద్ద ఆసుపత్రికి తరలించేందుకు తగిన భద్రత కల్పించాలని పోలీసు అధికారులను హైకోర్టు ఆదేశించింది. అసాధారణంగా మంగళవారం అర్ద రాత్రి దాటాక 12.30 గంటలకు జస్టిస్ ఎస్. మురళీధర్ ఇంటిలోనే ప్రత్యేకంగా విచారణ జరిపి ఉత్తర్వులు ఇచ్చింది. దాడుల్లో గాయపడిన ముస్లింలు ముస్తఫాబాద్ లోని చిన్న క్లినిక్ (అల్ హింద్ ఆసుపత్రి)లో చేరారు. వారిని జీటీబీ ఆసుపత్రికి వెళ్లలేకపోతున్నారని న్యాయవాది సురూర్ మందర్ న్యాయమూర్తులకు నివేదించారు.

2020-02-26 Read More

‘‘మన గౌరవనీయమైన సుప్రీంకోర్టు షహీన్ బాగ్ ట్రాఫిక్ అంతరాలపై ఆందోళనతో పరిష్కారం కోసం తన పర్యవేక్షణలోనే ఓ మధ్యవర్తుల బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే, తనకు తూర్పు దిక్కున రెండు మైళ్ళ దూరంలో జరుగుతున్న అల్లర్లు, సామూహిక దహనాలు, హత్యలపై బాధపడటంలేదు. ఎందుకంటే ‘చట్టం దాని పని అది చేసుకుపోతుంది’’’- ప్రముఖ జర్నలిస్టు శేఖర్ గుప్తా చేసిన ట్వీట్ ఇది. ఢిల్లీ అల్లర్లను కవర్ చేస్తున్న చాలా మంది జర్నలిస్టులు సామూహిక హింసాకాండపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2020-02-25
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 Last Page