ఈశాన్య ఢిల్లీ మతోన్మాద దాడుల సమయంలో కాల్పులు జరిపి పోలీసుకు తుపాకి గురిపెట్టిన దుండగుడిని ఉత్తరప్రదేశ్ లో అరెస్టు చేశారు. అతనిని ఢిల్లీ తరలిస్తున్నట్టు మంగళవారం పోలీసులు వెల్లడించారు. ఎర్ర టీషర్టు, జీన్స్ ధరించిన ఆ దుండగుడిని షారుఖ్ (33)గా ఫిబ్రవరి 24నే పోలీసులు గుర్తించారు. ఢిల్లీ జఫ్రాబాద్ - మౌజ్ పూర్ రోడ్డుపై 24న నాటు తుపాకితో అతను వీరంగం వేయడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. అతను 8 రౌండ్లు కాల్పులు జరిపినట్టు రికార్డయింది.
2020-03-03 Read Moreగత ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన బీకర దాడికి సంబంధించి.. తారిక్ అహ్మద్, ఇన్షా తారిక్ (26) అనే తండ్రీ కుమార్తెల ద్వయాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. కొద్ది రోజుల క్రితం అరెస్టైన జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాది షకీర్ బషీర్ (22) ఇచ్చిన సమాచారంతో తాజా అరెస్టులు జరిగాయి. ఈ నిందితులు సి.ఆర్.పి.ఎఫ్. కాన్వాయ్ కదలికలను గమనించి బాంబుల ట్రక్కు అక్కడికి రావడానికి సహకరించారని ఆరోపణ. దాడికి కుట్ర కూడా వీరి నివాసంలోనే జరిగినట్టు ఓ అధికారి చెప్పారు.
2020-03-03 Read Moreస్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 59.85 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ.. ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. 50 శాతం సీలింగ్ ప్రకారం... నెల రోజుల్లోపు బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2020-03-022012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. రేపు (మార్చి 3న) నలుగురు దోషులను ఉరి తీయాల్సి ఉండగా... నాలుగో వ్యక్తి ‘క్షమాబిక్ష’ పిటిషన్ ను సోమవారం రాష్ట్రపతి తిరస్కరించారు. అయితే, క్షమాబిక్ష పిటిషన్ తిరస్కరణకు, మరణ శిక్ష అమలుకు మధ్య వ్యవధి ఉండాలి. ఈ నేపథ్యంలోనే రేపు ఉరి శిక్ష అమలు కాదని ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు ప్రకటించింది. ఎప్పుడు ఉరి తీసేదీ మళ్లీ ప్రకటించనుంది.
2020-03-02‘‘మీరు నిప్పుతో ఆట ఆడుతున్నారు... మీరు జాగ్రత్తగా ఉండాలి’’ 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో దోషి పవన్ గుప్తా న్యాయవాదికి ఢిల్లీ జడ్జి ధర్మేంద్ర రాణా చేసిన హెచ్చరిక ఇది. రాష్ట్రపతికి క్షమాబిక్ష పిటిషన్ పెట్టుకున్న నేపథ్యంలో రేపు ఉరిని ఆపాలని పవన్ గుప్తా వేసిన పిటిషన్ పై జడ్జి ధర్మేంద్ర సోమవారం విచారణ జరిపారు. రాష్ట్రపతి నిర్ణయం వెలువడాల్సిన నేపథ్యంలో తీర్పును రిజర్వు చేశారు. అయితే, దోషులు అన్ని అవకాశాలనూ వినియోగించుకోవడానికి గత నెలలో ఢిల్లీ హైకోర్టు నిర్దేశించిన వారం రోజుల ‘డెడ్ లైన్’ దాటిపోయిందని జడ్జి గుర్తు చేశారు.
2020-03-02 Read More2012 ఢిల్లీ సామూహిక హత్యాచారం కేసులో నాలుగో దోషి క్షమాబిక్ష పిటిషన్ ను కూడా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సోమవారం తిరస్కరించారు. ఢిల్లీ కోర్టు ఇచ్చిన డెత్ వారంట్ ప్రకారం దోషులు నలుగురినీ మార్చి 3న ఉరి తీయవలసి ఉండగా... పవన్ గుప్తా రాష్ట్రపతికి క్షమాబిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. మిగిలిన ముగ్గురి విన్నపాలనూ ఇంతకు ముందే తిరస్కరించారు. పవన్ గుప్తా పిటిషన్ తిరస్కరణతో.. ఉరి శిక్షను వాయిదా వేయించడానికి దోషులు వేస్తున్న ఎత్తుగడల్లో చివరి అంకం ముగిసినట్టే. అయితే, రేపు ఉరి తీస్తారా లేదా? అన్నది తేలాలి.
2020-03-02ఒకే తరగతి విద్యార్ధుల్లో మార్కుల ప్రాతిపదికన టాపర్లను ఒక సెక్షన్లో.. మిగిలినవారిని మరో సెక్షన్లో కూర్చోబెట్టడం విద్యకు సంబంధించిన ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని పంజాబ్-హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి పోకడ... తక్కువ మార్కులు పొందిన విద్యార్ధుల్లో ఆత్మన్యూనతా భావాన్ని కలిగిస్తుందని జస్టిస్ సుధీర్ మిట్టల్ ఉద్ఘాటించారు. పంజాబ్ లోని ఫరీద్ కోట్ పట్టణ వాసి డాక్టర్ నీతు కుకర్ వేసిన పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది. తన కుమార్తె 6వ తరగతి నుంచి ఈ వివక్షను ఎదుర్కొంటోందని (ప్రస్తుతం 8వ తరగతి) ఆమె నివేదించారు.
2020-02-29 Read Moreనిన్న విశాఖ పర్యటనకు వెళ్ళిన ప్రతిపక్ష నేత చంద్రబాబును 151 సెక్షన్ కింద అరెస్టు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తప్పు పట్టింది. నేరం చేసే అవకాశం ఉన్న వ్యక్తిని నిరోధించడానికి ఉపయోగించే 151 సెక్షన్ కింద చంద్రబాబుకు నోటీసు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించింది. చంద్రబాబు పర్యటనను అడ్డుకున్న నేపథ్యంలో..టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ శుక్రవారం హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని డీజీపీని, విశాఖ పోలీసులను ఆదేశించిన హైకోర్టు... విచారణను మార్చి 2కి వాయిదా వేసింది.
2020-02-28విద్వేష ప్రసంగాలపై ఎఫ్ఐఆర్ నమోదుకు సమయం అనుకూలంగా లేదన్న భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదన.. నిన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మురళీధర్ ను ఒప్పించలేకపోయింది. కానీ, గురువారం ఈ కేసులో వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి ధీరూభాయ్ నరేన్‌భాయ్ పటేల్ కన్విన్సయ్యారు. జస్టిస్ పటేల్, జస్టిస్ హరిశంకర్ ల ధర్మాసనం కౌంటర్ అఫిడవిట్ దాఖలు కోసం కేంద్రానికి 4 వారాలు గడువిచ్చింది. మళ్ళీ ఏప్రిల్ 13న వాదనలు విననుంది. నిన్న జస్టిస్ మురళీధర్ 24 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు.
2020-02-28 Read Moreకర్నూలు సుగాలీ ప్రీతి ‘హత్యాచారం’ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెం. 37) జారీ చేసింది. 2017లో కర్నూలు కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ప్రీతి అత్యాచారానికి, హత్యకు గురైంది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీబీఐకి అప్పగించాలనే డిమాండుతో కర్నూలులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ తర్వాత సిఎం జగన్ బాధితురాలి తల్లికి హామీ ఇచ్చారు.
2020-02-28