స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కారుకు ఎదురు దెబ్బ తగిలింది. ‘కరోనా వైరస్’ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల వాయిదాను సమర్ధిస్తూ.. నిర్వహణపై ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం స్పష్టం చేసింది. అయితే, వాయిదా కాలంలో ఎన్నికల నిబంధనావళిని అమలు చేయవద్దని ఆదేశించింది. కొత్త పథకాలు చేపట్టకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. వాయిదా కాలం ముగిశాక.. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని కమిషన్ కు సూచించింది.
2020-03-18కరోనా భయం సుప్రీంకోర్టునూ వెన్నాడింది. అత్యవసర స్వభావం ఉన్న కేసులనే విచారణకు చేపట్టాలని న్యాయమూర్తులు నిర్ణయించారు. శుక్రవారం సుప్రీంకోర్టు జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. సోమవారం (మార్చి 16న) కేవలం ఆరు ధర్మాసనాలు పని చేయనున్నాయి. వాటిలో 1. అరుణ్ మిశ్రా, ఎంఆర్ షా, 2. ఉదయ్ ఉమేష్ లలిత్, వినీత్ శరన్, 3. ఎఎం ఖాన్విల్కర్, దినేష్ మహేశ్వరి, 4. డివై చంద్రచూడ్, హేమంత్ గుప్తా, 5. ఎల్. నాగేశ్వరావు, ఎస్. రవీంద్ర భట్, 6. సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా ఉన్నారు. సవరించిన కారణాల జాబితాను 14న వెల్లడిస్తారు.
2020-03-13 Read Moreఉన్నావ్ రేప్ నిందితుడు, బిజెపి బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ కు 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది. బాధితురాలి తండ్రిని హత్య చేసిన కేసులో న్యాయస్థానం ఈ శిక్షను విధించింది. యూపీ ఎమ్మెల్యే 2017లో ఓ మహిళపై అత్యాచారం చేశాడు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేయలేదు. బిజెపి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా బాధితురాలి కుటుంబాన్నే నిర్మూలించడానికి ప్రయత్నించాడు. ఈ నేరాలు దేశం దృష్టిని ఆకర్షించాక.. 2019 ఆగస్టులో బిజెపి అతన్ని బహిష్కరించింది. శుక్రవారం తీర్పు వెలువరించిన జడ్జి ‘శక్తివంతుడిపై పోరాడినందుకు అభినందనలు’ తెలిపారు.
2020-03-13‘‘మా ప్రాణాలు కాపాడాలని పోలీసు వ్యవస్థను చేతులెత్తి వేడుకుంటున్నాం. మాకేమి జరిగినా పోలీసు వ్యవస్థే బాధ్యత వహించాలి’’ అని విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. బుధవారం మాచర్లలో వైసీపీ నేతల దాడికి గురైన బొండా, గురువారం విజయవాడలో నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలసి భద్రతకోసం విన్నవించారు. దాడిలో ధ్వంసమైన కారుతోనే ఆయన కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. ఓ పథకం ప్రకారం.. తమకు భద్రత తొలగించి హతమార్చే ప్రయత్నం జరుగుతోందని ఉమ ఆరోపించారు.
2020-03-12మాచర్లలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు, అడ్వకేట్ కిషోర్ లపై దాడి చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. తురకా కిషోర్, మల్లెల గోపి, బత్తుల నాగరాజు లపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు ఐజి ప్రభాకరరావు తెలిపారు. దాడిలో బొండా వాహనంతో పాటు పోలీసు వాహనం కూడా ధ్వంసమైనట్టు చెప్పారు. ఎంపిటిసి, జడ్.పి.టి.సి. ఎన్నికల్లో టీడీపీ నేతలను నామినేషన్లు వేయనివ్వకుండా వైసీపీ శ్రేణులు అనేక చోట్ల అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం దాడి జరిగింది.
2020-03-11స్థానిక ఎన్నికల సందర్భంగా పార్టీ ఆదేశాల మేరకు మాచర్ల వెళ్లిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు లపై స్థానిక వైసీపీ నేతలు దాడి చేశారు. వారిద్దరూ ప్రయాణిస్తున్న కారుపై పెద్ద కట్టెలతో పొడుస్తూ అద్దాలు బద్దలు కొట్టారు. ఈ దాడిలో అడ్వకేట్ కిషోర్ తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ అభ్యర్ధి నామినేషన్ ను అడ్డుకోవడంతో ఆ సమస్య పరిష్కారం కోసం తాము అక్కడికి వెళ్లామని బాధిత నేతలు, న్యాయవాది కిషోర్ దాడి అనంతరం చెప్పారు. పోలీసు వాహనంలోకి మారితే ఆ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారని బుద్ధా వెంకన్న చెప్పారు.
2020-03-11మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హత్య (2019 మార్చి 15న) జరిగి ఏడాది గడచినా దర్యాప్తులో పురోగతి లేకపోవడంపై పలు సందేహాలతో వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత సీబీఐ విచారణ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఎన్నికలకు ముందు బాబాయి హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని కోరిన జగన్మోహన్ రెడ్డి, సిఎం అయ్యాక పిటిషన్ ఉపసంహరించుకున్నారు. వివేకా కుటుంబం, ప్రభుత్వం వైపు వాదనలు విన్న హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.
2020-03-11కుంభకోణాలతో కునారిల్లిన ‘ఎస్’ బ్యాంకు ఛైర్మన్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టయ్యారు. శనివారం ముంబైలోని బల్లార్డ్ పియెర్ కార్యాలయంలో రాణాను కొన్ని గంటల పాటు ప్రశ్నించిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు, రాత్రి బాగా పొద్దుపోయాక అరెస్టు చేశారు. అంతకు ముందు రాణా, ఆయన కుమార్తెల ఇళ్ళు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ‘ఎస్’ బ్యాంకు బోర్డును ఈ నెల 5న రిజర్వు బ్యాంకు రద్దు చేసింది. ఖాతాదారులు రూ. 50 వేల కంటే ఎక్కువ సొమ్మును తిరిగి తీసుకునే అవకాశం లేకుండా ఆంక్షలు విధించింది.
2020-03-082012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు దోషులు నలుగురినీ మార్చి 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీ పాటియాలా కోర్టు తాజా డెత్ వారెంట్ జారీ చేసింది. దోషులు ఒక్కరొక్కరే క్షమాబిక్ష పిటిషన్లు పెట్టుకొని ఇంతకు ముందు జారీ అయిన డెత్ వారంట్లను రద్దు వేయించుకోలిగారు. దోషులకు ఉన్న అన్ని అవకాశాలూ ముగిశాయంటూ గురువారం జడ్జి ధర్మేంద్ర రాణా తాజా డెత్ వారెంట్ జారీ చేశారు. ఇప్పుడిక ఉరిశిక్ష తేదీని ఖరారు చేయడానికే ఇంకేమీ న్యాయపరమైన అడ్డంకి లేదని దోషుల తరపు న్యాయవాది కూడా అంగీకరించారు.
2020-03-05 Read More2019 జూన్ నుంచి 2020 ఫిబ్రవరి వరకు రాష్ట్రంలో 12,500 నాటుసారా కేసులు నమోదైనట్టు ఏపీ ఉపముఖ్యమంత్రి, అబ్కారీ శాఖ మంత్రి కె. నారాయణస్వామి మంగళవారం వెల్లడించారు. 36,73,682 లీటర్ల బెల్లం ఊటను.. 1,43,915 లీటర్ల నాటుసారాను, 939 వాహనాలను స్వాధీనం చేసుకొని 8,171 మందిని అరెస్టు చేసినట్టు ఆయన చెప్పారు. అక్రమ మద్యం కేసులు 7,805 నమోదు కాగా 8,046 మందిని అరెస్టు చేశామని తెలిపారు. 170 గంజాయి కేసుల్లో 31,609 కేజీల సరుకు స్వాధీనం చేసుకొని 317 మందిని అరెస్టు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు.
2020-03-03