ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సాధారణ బెయిలు మంజూరైంది. గత నెల 31న మంజూరైన మధ్యంతర బెయిలునే రెగ్యులర్ బెయిలుగా మారుస్తూ సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లిఖార్జునరావు ఉత్తర్వులు వెలువరించారు. మధ్యంతర బెయిలుపై ఇప్పటికే జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబుకు తాజా ఉత్తర్వు పెద్ద ఉపశమనం కలిగించింది. ఈ నెల 28న చంద్రబాబు తిరిగి జైలుకు వెళ్లవలసిన అవసరం లేదు. అయితే, మధ్యంతర బెయిలు ఉత్తర్వుల్లో పేర్కొన్న కొన్ని షరతులు 28వ తేదీవరకు వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది. అప్పటివరకు చంద్రబాబు రాజకీయ ర్యాలీలు నిర్వహించడానికి అవకాశం లేదు. చంద్రబాబు చ

2023-11-20

ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది. గురువారం అరబిందో ఫార్మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. శరత్ చంద్రా రెడ్డిని, ఓ మద్యం కంపెనీకి చెందిన బినయ్ బాబును అరెస్టు చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా వారి అరెస్టు జరిగినట్టు సమాచారం. అరెస్టులకు ముందు వారిద్దరికీ సంబంధించిన భవనాల్లో ED సోదాలు నిర్వహించింది. అరెస్టయిన ఇద్దరినీ వైద్య పరీక్షల అనంతరం రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు.

2022-11-10

లఖీంపూర్ హత్యాకాండ కేసులో దర్యాప్తుపై ఓ నివేదికను రేపటిలోగా సమర్పించాలని సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారుతో రైతులను తొక్కించిన ఘటనపై సుప్రీంకోర్టు గురువారం విచారించింది. నిందితుల వివరాలు, వారిని అరెస్టు చేశారా.. లేదా? అన్న అంశం రిపోర్టులో ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరణించిన లవ్ ప్రీత్ సింగ్ తల్లికి వైద్యసాయం అందించాలని కూడా సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

2021-10-07

నలుగురు రైతుల సామూహిక హత్యతో పాటు మొత్తం 8 మంది మరణించిన లఖీంపూర్ ఖేరి ఘటనలపై విచారణకు సుప్రీంకోర్టు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ, న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమా కోహ్లి గురువారం విచారించనున్నారు. లఖీంపూర్ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలంటూ యూపీకి చెందిన ఇద్దరు లాయర్లు నిన్న సిజెఐకి లేఖ రాసిన నేపథ్యంలో బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు.

2021-10-06

ఐటి చట్టంలోని సెక్షన్ ‘66ఎ’ని కొట్టివేశాక కూడా ఆరేళ్ళుగా కేసులు నమోదు చేయడంపై సుప్రీంకోర్టు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, హైకోర్టుల రిజిస్ట్రార్లకు నోటీసులు జారీ చేసింది. పోలీసులు రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి, రాష్ట్రాలను కూడా పార్టీలుగా చేర్చాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి సూచించింది. ఇందులో ఒక అంశం పోలీసులు కాగా మరొకటి న్యాయవ్యవస్థ అని న్యాయవాది పేర్కొనగా ‘‘న్యాయవ్యవస్థ సంగతి విడిగా చూసుకుంటాం. ఇక్కడ పోలీసులూ ఉన్నారు. ఒక సరైన ఉత్తర్వు ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఇది కొనసాగకూడదు’’ అని ధర్మాసనం ఉద్ఘాటించింది.

2021-08-02

ఆంధ్రా, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదంపై వాదనలను వినేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ కాస్తంత ఇబ్బంది పడ్డారు. తాను రెండు రాష్ట్రాలకు చెందినవాడినన్న జస్టిస్ రమణ, జల వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఉభయ రాష్ట్రాలకూ హితవు పలికారు. ఈ అంశాన్ని చట్టపరంగా కాకుండా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటామంటే సహకరిస్తామని సిజెఐ పేర్కొన్నారు. లేదంటే మరో ధర్మాసనానికి ఈ అంశాన్ని బదిలీ చేస్తానని చెప్పారు. కృష్ణా జలాల పంపకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ పిటిషన్ దాఖలు చేసింది.

2021-08-02

ఏ రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ అధికారులపైనైనా దర్యాప్తు జరపడానికి సిబిఐకి రాష్ట్రాల అనుమతి అక్కర్లేదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. తృణమూల్‌ కాంగ్రెస్ నాయకుడు వినయ్ మిశ్రాపై సిబిఐ దర్యాప్తు చేస్తున్న స్మగ్లింగ్ కేసులలో జోక్యానికి కోర్టు నిరాకరించింది. 2018లో రాష్ట్రం సిబిఐకి సాధారణ అనుమతిని ఉపసంహరించుకున్నందున తమపై దర్యాప్తు చెల్లదని పిటిషనర్లు వాదించారు. అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పాత్ర ఉన్న కేసుల్లో దర్యాప్తునకు మాత్రం రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది.

2021-07-28

వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడు ఎర్రగంగిరెడ్డి తనను బెదిరించాడని వాచ్ మన్ రంగన్న చెప్పారు. తన పేరు చెబితే నరికేస్తానన్నాడని, అందువల్లనే ఇన్నాళ్ళూ తాను నోరు మెదపలేదని రంగన్న తాజాగా మీడియాకు చెప్పారు. సీబీఐ ఇచ్చిన భరోసాతో ఇప్పుడు చెబుతున్నానన్నారు. వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి తాను జమ్మలమడుగు కోర్టులో వాంగ్మూలం ఇచ్చినట్టు రంగన్న తెలిపారు. వివేకా ఇంటికి ఎర్రగంగిరెడ్డి తరచూ వచ్చేవాడని, తనతో చాలాసార్లు మాట్లాడాడని రంగన్న చెప్పారు. అయితే, రంగన్నను తాను ఒకేసారి చూశానని ఎర్రగంగిరెడ్డి చెబుతున్నారు.

2021-07-24

‘దేశద్రోహం’ నేరాన్ని ఆపాదించే చట్టాన్ని బ్రిటిష్ వలస పాలకుల చట్టంగా సుప్రీంకోర్టు ఈసడించింది. స్వాతంత్ర పోరాటాన్ని అణచివేయడానికి ఉపయోగించిన ఆ చట్టం స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా అవసరమా? అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక చెక్కను మలచడానికి కార్పెంటర్ కు రంపం ఇస్తే అడవి మొత్తాన్ని నరికేసినట్టుగా, ‘దేశద్రోహం’ చట్టం అపరిమితంగా దుర్వినియోగం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

2021-07-15

కొత్త ఐటి నిబంధనల రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ పై మూడు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టులలో విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వనందున ఈ అంశంలో తాము ముందుకు వెళ్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. వివిధ హైకోర్టులలో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ తాము విన్నవించామని కేంద్రం చెప్పగా, ‘‘మీరు ఒక బదిలీ దరఖాస్తు చేసినంతనే, హైకోర్టు ముందు విచారణ నిలిచిపోయినట్టు అర్థమా?’’ అని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది.

2021-07-14
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 Last Page