దక్షిణ ఇజ్రాయిల్ భూభాగంపై గాజా మిలిటెంట్లు శనివారం రాకెట్ల వర్షం కురిపించారు. తొలుత 50 మిసైళ్ళు తమ భూభాగంపై పడ్డాయని చెప్పిన ఇజ్రాయిల్ చివరికి ఆ సంఖ్యను 200కు పెంచింది. కొన్ని డజన్ల రాకెట్లను ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ మిసైళ్ళు కూల్చేశాయి. శనివారమే ఇజ్రాయిల్ చేసిన ప్రతిదాడిలో గాజా ప్రాంతంలో ముగ్గురు పాలస్తీనియన్లు మరణించారు. వారిలో తీవ్రవాదులెవరూ లేరు. ఒక పసిపాప, ఈ పాప తల్లి అయిన గర్భిణీ స్త్రీ, మరొక పౌరుడు మరణించారు. మరో 17మంది గాయపడ్డారు.

2019-05-04 Read More

జైష్ ఎ మహ్మద్ (జెఇఎం) చీఫ్ మసూద్ అజర్ ఆస్తులను సీజ్ చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో మసూద్ పేరు చేరుస్తూ ఐక్యరాజ్యసమితి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో... పాకిస్తాన్ ఆంక్షలు విధించింది. పాకిస్తాన్ లోనే ఉన్న మసూద్ ప్రయాణాలపైన, ఆయుధాల అమ్మకం కొనుగోళ్ళపైన నిషేధం ఉంటుంది. జెఇఎంకు ఆల్ ఖైదాతో సంబంధం ఉందన్న కారణంతో ఆ సంస్థ అధిపతి అయిన అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది ఐరాస కమిటీ.

2019-05-03 Read More

మహారాష్ట్రలో మావోయిస్టులకు పట్టున్న గడ్చిరోలి జిల్లాలో బుధవారం ఓ ఐఇడి పేలుడులో 15 మంది జవాన్లు, ఒక సాధారణ పౌరుడు మరణించారు. ముందు రోజు రాత్రి దాద్పూర్ గ్రామం వద్ద రోడ్డు నిర్మాణంలో పాలు పంచుకుంటున్న 36 వాహనాలను నక్సల్స్ దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో భద్రతకోసం వినియోగించిన ప్రత్యేక పోలీసు దళాన్ని మావోయిస్టులు టార్గెట్ చేశారు. ఇటీవల ఇద్దరు సీనియర్ మహిళా మావోయిస్టులను ప్రత్యేక దళాలు కాల్చి చంపిన ఘటనకు ప్రతీకారంగానే తాజా దాడి జరిగినట్టు భావిస్తున్నారు.

2019-05-01 Read More

భారత దేశంలో భయానక దాడులకు సూత్రధారి, జైష్ ఎ మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ పేరును ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేరుస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి బుధవారం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయానికి పేర్కొన్న కారణాల్లో... ‘పుల్వామా ఉగ్రవాద దాడి’ లేకపోవడం గమనార్హం. ఫిబ్రవరి 14న జరిగిన ఈ దాడిలో 40 మందికి పైగా భారత జవాన్లు మరణించారు. ఏది ఏమైనా భద్రతా మండలి నిర్ణయం భారత దేశానికి ఓ విజయమే. ఇంతకు ముందు అనేకసార్లు ఆపిన చైనా ఈసారి అభ్యంతర పెట్టకపోవడంతో భద్రతా మండలి నిర్ణయం సాఫీగా జరిగింది.

2019-05-01 Read More
First Page 1 2 3 4 5 Last Page