జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామారకు సమీపంలోని అరిహాల్ గ్రామం వద్ద ఒక ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. సోమవారం సాయంత్రం 44వ రాష్ట్రీయ రైఫిల్స్ సాయుధ వాహనంపై ఓ ఆత్మహుతి దళ సభ్యుడు దాడి చేసినట్టు ప్రాథమిక సమాచారం. కాస్పర్ వాహనంపై దాడి జరిగిన వెంటనే బుల్లెట్లు, రాళ్ల వర్షం కురిసింది. ప్రస్తుతం ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఘటనను ఆర్మీ ‘‘విఫల ప్రయత్నం’’గా అభివర్ణించింది.

2019-06-17 Read More

జమ్మూ కాశ్మీర్ ఇస్లామిక్ స్టేట్ (ఐ.ఎస్.జె.కె)కు పాకిస్తాన్ లింకు ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) తెలిపింది. ఈ ఉగ్రవాదులకు పాకిస్తాన్ నుంచే మార్గనిర్దేశనం జరుగుతోందని ఇటీవల జమ్మూ కోర్టులో సమర్పించిన చార్జిషీటులో నిర్ధారించింది. గత నవంబరులో ఢిల్లీ పోలీసులు శ్రీనగర్ పట్టణంలో అరెస్టు చేసిన నలుగురిలో ముగ్గురు (తాహిర్, హారిస్, ఆసిఫ్ నదాఫ్) ఐఎస్ క్రియాశీల ఉగ్రవాదులని ఎన్ఐఎ పేర్కొంది.

2019-06-16

‘‘గాడ్సే..గాంధీ దేహాన్ని చంపితే ప్రగ్యా ఠాకూర్ వంటివాళ్ళు ఆయన ఆత్మను, అహింసను, శాంతిని, సహనాన్ని, మొత్తంగా భారతీయాత్మను చంపుతున్నారు’’- నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి వ్యాఖ్య ఇది. గాంధీ హంతకుడు గాడ్సేను దేశభక్తుడిగా కీర్తించిన బీజేపీ భోపాల్ అభ్యర్ధి ప్రగ్యాఠాకూర్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధర్మాన్ని పాటించాలని బీజేపీ నాయకత్వానికి హితవు పలికారు. అధికారానికి, రాజకీయాలకు గాంధీ అతీతుడని కైలాష్ సత్యార్థి ఉద్ఘాటించారు.

2019-05-18 Read More

జాతిపిత మహాత్మా గాంధీని చంపిన నాథురాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించి మరో వివాదాన్ని లేపారు భోపాల్ బీజేపీ లోక్ సభ అభ్యర్ధి ప్రగ్యా ఠాకూర్. స్వతంత్ర భారత తొలి ‘తీవ్రవాది’ నాథురాంగాడ్సే అని సినీ నటుడు కమల్ హాసన్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రగ్యాఠాకూర్ స్పందించారు. నాథురాం గాడ్సే దేశభక్తుడుగా వ్యవహరించారని, ఇకపైనా దేశభక్తుడిగానే గుర్తింపు పొందుతారని ప్రగ్యా పేర్కొన్నారు. ప్రగ్యా ఠాకూర్ 2008 మాలెగావ్ బాంబు పేలుళ్ళ ఘటనలో నిందితురాలు.

2019-05-16 Read More

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా పట్టణంలో గురువారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు తీవ్రవాదులు, ఒక జవాను, మరో పౌరుడు మరణించారు. పట్టణంలోని దాలిపొరా ప్రాంతంలో గురువారం వేకువజామున మిలిటెంట్లకోసం సోదాలు చేస్తున్నప్పుడు జవాన్లపై కాల్పులు మొదలయ్యాయి. సైన్యం ఎదురు కాల్పులు జరపడంతో కొద్దిసేపు హోరాహోరీ పోరు జరిగింది. మిలిటెంట్లు దాగి ఉన్న ఇంటి యజమాని కుమారుడు రయీస్ అహ్మద్ దర్ కూడా ఈ కాల్పుల్లో చనిపోయినట్టు సమాచారం.

2019-05-16 Read More

పాకిస్తాన్ లోని ఓడరేపు పట్టణం గ్వాదర్ లో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు మరణించగా... తాము ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టినట్టు ఆ దేశ ఆర్మీ ఆదివారం ప్రకటించింది. పెరల్ కాంటినెంటల్ హోటల్ పైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్ఎ) ఉగ్రవాదులు శనివారం జరిపిన దాడిలో ఒక సెక్యూరిటీ గార్డు సహా నలుగురు హోటల్ సిబ్బంది, ఒక నావికాదళ సైనికుడు మరణించారు. ఇద్దరు ఆర్మీ కేప్టెన్లు, ఇద్దరు నేవీ సైనికులు, మరో ఇద్దరు హోటల్ సిబ్బంది గాయపడ్డారు.

2019-05-12 Read More

పాకిస్తాన్ లోని గ్వాదర్ వద్ద పెరల్ కాంటినెంటల్ హోటల్ లో దాడి చేసింది తామేనని వేర్పాటువాద సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్ఎ) ప్రకటించింది. ఆ హోటల్ లో బస చేస్తున్న చైనా పెట్టుబడిదారులు, ఇతర విదేశీ పెట్టుబడిదారులే తమ లక్ష్యమని ఆ సంస్థ స్పష్టం చేసింది. తీవ్రవాదుల కాల్పుల్లో ఒకరు చనిపోయినట్టు పాకిస్తాన్ ఆర్మీ తెలిపింది. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)లో భాగంగా బలూచిస్తాన్లో పెద్ద మొత్తంలో మౌలిక సదుపాయల ప్రాజెక్టులను చేపట్టారు. చైనా ‘‘బెల్ట్ అండ్ రోడ్’’ ప్రాజెక్టులకు కీలకమైనందునే గ్వాదర్ పోర్టు పట్టణంపై బిఎల్ఎ కన్నేసింది.

2019-05-11 Read More

పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న గ్వాదర్ పట్టణంలో ఓ ఫైవ్ స్టార్ హోటల్ పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. భారీగా ఆయుధాలు ధరించిన ముగ్గురు దుండగులు శనివారం సాయంత్రం 5:15 గంటలకు గ్వాదర్ లోని పెరల్ కాంటినెంటల్ (పిసి) హోటల్ లోకి ప్రవేశించారు. తర్వాత కాల్పుల శబ్దం వినిపించినట్టు హోటల్ బయట ఉన్నవారు చెప్పారు. కాగా హోటల్ లో ఉన్న విదేశీ, దేశీయ అతిధులను క్షేమంగా బయటకు తెచ్చినట్టు బలూచిస్తాన్ సమాచార శాఖ మంత్రి జహూర్ బులేది చెప్పారు. భద్రతా దళాలు హోటల్ లోకి ప్రవేశించాయి.

2019-05-11

ఇండియాలో ఒక ప్రావిన్సును ఏర్పాటు చేసినట్టు ఇస్లామిక్ స్టేట్ మొదటిసారిగా ప్రకటించింది. దానికా ఉగ్రవాద సంస్థ పెట్టిన పేరు ‘‘విలయా ఆఫ్ హింద్’’. కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లా అంషిపోరా పట్టణంలో జరిగిన ఎన్ కౌంటర్లో ఒక ఉగ్రవాది మరణించినట్టు భద్రతా దళాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ స్టేట్ శుక్రవారం రాత్రి ఓ ప్రకటన చేసింది. అంషిపోరాలో భారత సైనికులను చంపినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. ఇరాక్, సిరియాలలో ఉగ్రవాద సైన్యాన్ని నడిపిన ఐఎస్, అక్కడ ఓటమి పాలయ్యాక ఇండియాలో ‘ప్రావిన్సు’ ప్రకటన చేయడం గమనార్హం.

2019-05-11 Read More

గత 48 గంటల్లో తాము 350 ఇస్లామిక్ జీహాదీ, హమస్ లక్ష్యాలపై దాడులు చేశామని ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. హమస్ రాకెట్ లాంచింగ్ ప్రదేశాలు, ఉగ్రవాద దళాలు, కమాండ్&శిక్షణా కేంద్రాలు, ఆయుధ స్థావరాలు, నిఘా పోస్టులు, మిలిటరీ ఆవరణలు తమ లక్ష్యాల్లో ఉన్నాయని ఇజ్రాయిల్ సోమవారం ఉదయం ప్రకటించింది. అదే 48 గంటల్లో గాజా నుంచి ఇజ్రాయిల్ పౌరులపై 690 రాకెట్లు ప్రయోగించారని, వాటిలో 240 రాకెట్లను ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ మిసైళ్ళు కూల్చేశాయని ఐడిఎఫ్ ట్విట్టర్లో పేర్కొంది.

2019-05-06 Read More
First Page 1 2 3 4 5 Last Page