జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో డి.ఎస్.సి. స్థాయి పోలీసు అధికారి ఒకరిని ఉగ్రవాదులతో కలసి ఉండగా పట్టుకున్నారు. దక్షిణ కాశ్మీర్ లోని కుల్గాం జిల్లా మీర్ బజార్ ప్రాంతంలో ఈ అరెస్టులు జరిగాయి. డీఎస్పీ దేవీందర్ సింగ్ తన కారులో ఇద్దరు జైష్ ఇ మహ్మద్ (జెఇఎం) ఉగ్రవాదులతో కలసి ప్రయాణిస్తుండగా పోలీసులు ఫాలో అయ్యారు. ఉగ్రవాదులను అరెస్టు చేసి ఐదు గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత దేవీందర్ సింగ్ ఇల్లు సోదా చేస్తే రెండు ఎ.కె.47 రైఫిల్స్ దొరికాయి.

2020-01-11

ఇటీవల మరణించిన ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబుబకర్ అల్ బాగ్దాదీ సోదరి రస్మియా అవద్ ను అరెస్టు చేసినట్టు టర్కీ నిర్ధారించింది. బాగ్దాదీకి రస్మియా పెద్ద సోదరి. అలెప్పోకు ఉత్తరాన ఆమెతో పాటు ఆమె భర్తను, కోడలిని, ఐదుగురు పిల్లలను టర్కీ బంధించినట్టు వార్తలు వచ్చాయి. అస్మియాకు ఇస్లామిక్ స్టేట్ సమాచారం చాలా తెలుసని, ఆమె నోరు విప్పితే ఉగ్రవాద సంస్థకు చెందిన మరికొంతమంది కీలక వ్యక్తులను మట్టుపెట్టవచ్చని టర్కీ అధ్యక్ష కార్యాలయంలో కమ్యూనికేషన్ డైరెక్టర్ ఫహ్రెటిన్ అల్తున్ చెప్పారు.

2019-11-05 Read More

‘ఇస్లామిక్ స్టేట్’కు కొత్త సారథి వచ్చాడు. ఆ ఉగ్రవాద సంస్థ చీఫ్ అబుబకర్ అల్ బాగ్దాది, అధికార ప్రతినిధి అబు అల్ హసన్ అల్ ముహజిర్ మరణించిన తర్వాత తొలిసారిగా గురువారం ఓ ఆడియో ప్రకటనను విడుదల చేసింది. ఈ ఆడియో ప్రకటన ప్రకారం బాగ్దాది వారసుడిగా అబు ఇబ్రహీం అల్ హషీమి అల్ ఖురేషి నియమితుడయ్యాడు. ఇతను కూడా బాగ్దాది వంశానికి సంబంధించినవాడే అని సమాచారం. ఇస్లామిక్ స్టేట్ కొత్త అధికార ప్రతినిధిగా అబు హంజా అల్ ఖురేషి నియమితుడయ్యాడు.

2019-11-01

ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాది దాగిన ప్రదేశంపై అమెరికాకు సమాచారం ఇచ్చిన అంతర్గత వేగుకు రూ. 177.5 కోట్ల (2.5 కోట్ల డాలర్ల) సొమ్ము బహుమతిగా దక్కనుంది. బాగ్దాది దాగి ఉన్న ప్రదేశంతోపాటు అన్ని గదులతో కూడిన మ్యాప్ ను ఆ వేగు అమెరికా సైన్యానికి అందించినట్టు సమాచారం. ఈ నెల 26వ తేదీన బాగ్దాదిపై అమెరికా సైనికులు దాడి చేసినప్పుడు ఆ వేగు కూడా అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత రెండు రోజులకు అతనిని కుటుంబంతో సహా ఆ ప్రాంతంనుంచి తరలించారు.

2019-10-30 Read More

కాశ్మర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత స్థానికేతరులపై ఉగ్రవాద దాడులు పెరిగాయి. మంగళవారం కుల్గాం జిల్లాలో ఐదుగురు కాశ్మీరీయేతర కూలీలను ఉగ్రవాదులు కాల్చి చంపారు. మృతులంతా పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్ జిల్లాకు చెందినవారు. వారిలో ముగ్గురిని షేక్ కమ్రుద్దీన్, షేక్ మహ్మద్ రఫీక్, షేక్ ముర్న్సులిన్ లుగా గుర్తించారు. యూరోపియన్ పార్లమెంటేరియన్లు కాశ్మీర్లో పర్యటిస్తున్న రోజునే ఈ ఘటన జరగడం గమనార్హం.

2019-10-29

సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్సులో అమెరికా నిర్వహించిన ‘సీక్రెట్ ఆఫరేషన్’ సందర్భంగా ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబుబకర్ అల్ బాగ్దాది హతమయ్యారు. శనివారం హెలికాప్టర్ల ద్వారా అమెరికా సైనికులు బాగ్దాది ఉన్న ప్రాంతంలో నేరుగా దిగారు. కొద్దిసేపు ఎదురు కాల్పుల తర్వాత బాగ్దాది బెల్టుబాంబుతో ఆత్మాహుతికి పాల్పడ్డారని అమెరికా సైనికాధికారి ఒకరు చెప్పారు. బాగ్దాది చనిపోయినట్టు తమకు పూర్తి నమ్మకం ఉందని, అయితే డిఎన్ఎ, బయో మెట్రిక్ పరీక్షలతో నిర్ధారించాల్సి ఉందని అమెరికా రక్షణ శాఖ అధికారులు శ్వేతసౌధానికి సమాచారమిచ్చారు.

2019-10-27

జర్మనీలో జాతీయోన్మాదాన్ని రగిలించడంలో హిట్లర్ రాసిన పుస్తకం ‘‘మైన్ కంఫ్’’ పాత్ర పెద్దది. హిట్లర్ ఆత్మకథ-మేనిఫెస్టో 2 భాగాలుగా 1925, 1926లలో జర్మనీలో ప్రచురితమైంది. జాత్యహంకారంతో 60 లక్షల మంది యూదుల ఊచకోతకు, రెండో ప్రపంచ యుద్ధంలో కోట్లాది మంది మరణానికి కారణమైంది ‘‘హిట్లర్ మేనిఫెస్టో’’. ఇప్పుడలాంటి పుస్తకం (విమర్శలతో సహా) ఫ్రెంచ్ అనువాదాన్ని ప్రచురించడానికి జరుగుతున్న ప్రయత్నం ఆ యూరోపియన్ దేశంలో కలకలం సృష్టించింది. ఆ మృగాన్ని మళ్లీ లేపొద్దని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

2019-10-18 Read More

పంజాబ్‌కు చెందిన ఒక యాపిల్ వ్యాపారిని ఈ రోజు జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్‌లో ఉగ్రవాదులు కాల్చి చంపారు. షోపియాన్ లోని ట్రెంజ్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఈ దారుణం జరిగింది. ఇటీవలి కాలంలో కాశ్మీర్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను చంపడం ఇది మూడోసారి. బాధితురాలు చరణ్ జీత్ సింగ్ తో పాటు వచ్చిన వ్యక్తికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ రోజే పుల్వామాలో ఛత్తీస్‌గడ్ కు చెందిన ఒక కార్మికుడిని ఉగ్రవాదులు చంపేశారు.

2019-10-16 Read More

‘జమ్మూ కాశ్మీర్’కు కేంద్రం అదనపు భద్రతా బలగాలను తరలిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర యంత్రాంగం శుక్రవారం ఓ అసాధారణ ప్రకటన చేసింది. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులు, అమరనాథ్ యాత్రీకులు వెంటనే వెళ్లిపోవాలని సూచించింది. అమరనాథ్ యాత్రీకులపై ఉగ్రవాద దాడికి కుట్ర జరిగినట్టు సమాచారం వచ్చిందని ఆర్మీ, కాశ్మీర్ పోలీసులు శుక్రవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నామని ఆర్మీ అధికారి చెప్పారు.

2019-08-02

ఆప్రికా దేశం నైజీరియాలో సోమవారం జరిగిన ఉగ్రవాద దాడిలో 30 మంది మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. బోర్నో రాష్ట్ర రాజధానికి 25 కిలోమీటర్ల దూరంలోని కొండుగ గ్రామం వద్ద ఒక హాలు బయట ముగ్గురు ఆత్మహుతి దళ సభ్యులు బాంబులను పేల్చారు. ఫుట్ బాల్ అభిమానులు టీవీలో మ్యాచ్ తిలకిస్తుండగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు.

2019-06-17 Read More
First Page 1 2 3 4 5 Last Page