గత నెలలో లాహోర్ నగరంలో జరిగిన కారు బాంబు పేలుడు వెనుక ఇండియా ప్రణాళిక ఉందని పాకిస్తాన్ ఆరోపించింది. ఆ బాంబు పేలుడు ఒక భారతీయ ఇంటెలిజెన్స్ ఏజెంట్ పనేనని విచారణలో తేలినట్టు పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్ యూసుఫ్ విమర్శించారు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) కోసం పని చేస్తున్న ఒక భారతీయుడు ఈ పని చేశాడన్న మోయీద్, ఆ ఏజెంట్ పేరు మాత్రం చెప్పలేదు. ‘‘ప్రధాన మాస్టర్ మైండ్ ‘రా’కు చెందినవాడు అనడంలో ఏ సందేహమూ లేదు’’ అని మొయీద్ ఉద్ఘాటించారు.

2021-07-04

జాతిపిత మహాత్మాగాంధీ హంతకుడు నాథురాం గాడ్సేను దేశభక్తుడిగా మరోసారి కీర్తించారు బిజెపి ఎంపి ప్రగ్యా ఠాకూర్. 2008 మాలెగావ్ బాంబు పేలుళ్ళ కేసులో నిందితురాలైన ఈమె 2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఓసారి గాడ్సేని దేశభక్తుడిగా అభివర్ణించారు. ఎన్నికల సమయం కావడం వల్ల వివాదాన్ని చల్లార్చడానికి రంగంలోకి దిగిన బిజెపి అధినాయకత్వం, ఆమె చేత క్షమాపణలు చెప్పించింది. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు అప్పట్లో ప్రకటించిన ప్రగ్య తిరిగి అలాంటి వ్యాఖ్యలే ఇప్పుడు చేశారు.

2021-01-13 Read More

కరాచిలోని పాకిస్తాన్ స్టాక్ ఎక్సేంజిపై సోమవారం ఉదయం ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలోనూ, ఎదురు కాల్పులలోనూ ఐదుగురు మరణించారు. సోమవారం స్టాక్ ఎక్సేంజి ప్రారంభమయ్యాక ఉగ్రవాదుల గ్రూపు ఒకటి తుపాకులు, గ్రనేడ్లతో దాడి చేసింది. ప్రధాన ద్వారం వద్ద సెక్యూరిటీ గార్డును కాల్చి చంపి లోపలికి చొరబడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరో ఇద్దరు పౌరులు మరణించగా.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్టు ప్రాథమిక సమాచారం.

2020-06-29

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో ఓ సి.ఆర్.పి.ఎఫ్. జవాను, ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. రాజధాని శ్రీనగర్ కు 43 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఉదయం 5.30 గంటలకు భద్రతా దళాలు సంయుక్తంగా గస్తీ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఎదురు కాల్పులు జరిపినప్పుడు ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదులకోసం సోదాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో 30 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు 100 మంది ఎన్కౌంటర్లలో మరణించారు.

2020-06-23

జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్మీ కల్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనూప్ సూద్, పోలీసు ఎస్ఐ షకీల్ ఖాజి, సైనికులు రాజేష్, దినేష్ మరణించారు. రాజధానికి 70 కిలోమీటర్ల దూరంలోని హంద్వారా ప్రాంతంలో ఓ ఇంట్లోని పౌరులను ఉగ్రవాదులు నిర్బంధించినట్టు వచ్చిన సమాచారంతో... ఆర్మీ, జె&కె పోలీసులు సంయుక్త ఆపరేషన్ ను ప్రారంభించారు. పౌరులను విడిపించడానికి ఐదుగురితో కూడిన సంయుక్త బృందం టార్గెట్ ఏరియాలోకి ప్రవేశించింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. పౌరులను కాపాడినట్టు అధికారులు ప్రకటించింది.

2020-05-03

దేశ, రాష్ట్ర రాజధానుల్లో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ.. అస్సాం పేలుళ్ళతో ఉలిక్కిపడింది. అదివారం ఉదయం సరిగ్గా గణతంత్ర వేడుకలు జరిగే సమయంలోనే... 8.15, 8.25 గంటల మధ్య నాలుగు పేలుళ్ళు జరిగాయి. డిబ్రూగఢ్ జిల్లాలో మూడుచోట్ల, చరైడియో జిల్లాలో ఒకచోట పేలుళ్ళు సంభవించాయి. దులియాజన్ టినియాలి ప్రాంతంలో ఇద్దరు యువకులు మోటారు సైకిల్ పై వచ్చి గ్రెనేడ్ విసిరి పరారైనట్టు సీసీటీవీలో రికార్డైందని ఓ పోలీసు అధికారి చెప్పారు.

2020-01-26

హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను ఢిల్లీకి చేర్చే ప్రయత్నంలో పట్టుబడిన కాశ్మీర్ పోలీసు అధికారి దేవీందర్ సింగ్ విద్రోహం కథ చాలా పెద్దది. ముగ్గురు ఉగ్రవాదులను గత శుక్రవారం సోఫియాన్ ప్రాంతం నుంచి తన ఇంటికే తీసుకొచ్చి ఆ రాత్రి ఆశ్రయమిచ్చాడు. ఆ ఇల్లు బాదామిబాగ్ కంటోన్మెంట్ లోని ఆర్మీ 15 కార్ప్స్ కేంద్ర కార్యాలయం ప్రక్కనే ఉంది. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ నవీద్ బాబు, అతని అనుయాయులు ఇర్ఫాన్, రఫి శనివారం ఉదయమే జమ్మూకు బయలుదేరారు.

2020-01-14

రిపబ్లిక్ దినోత్సవానికి 15 రోజుల ముందు... ఇద్దరు వాంటెడ్ టెర్రరిస్టులను ఢిల్లీకి చేర్చే ప్రయత్నంలో కాశ్మీర్ డి.ఎస్.పి. దేవీందర్ సింగ్ దొరికిపోయాడు. 2001లో పార్లమెంటుపై దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఒకరికి ఇతను సహకరించినట్టు ఉరితీయబడిన అఫ్జల్ గురు లేఖ ద్వారా వెల్లడైంది. అప్పట్లో దర్యాప్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగా తప్పించుకున్న దేవీందర్, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఉగ్రవాదులతో కలసి ఉండగా దొరికిపోయాడు. అప్పుడు పార్లమెంటుపై దాడి చేశారు. మరి ఇప్పుడు రిపబ్లిక్ దినోత్సవమే లక్ష్యమా?

2020-01-13

ఉగ్రవాదులను తరలిస్తూ పట్టుబడిన దేవీందర్ సింగ్ ఇంతకు ముందే ఓసారి వార్తల్లోకి ఎక్కాడు. పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్షకు గురైన అఫ్జల్ గురు 2013లో రాసిన లేఖలో దేవీందర్ పాత్రను వివరించారు. పార్లమెంటుపై దాడి కేసులో నిందితుడు ‘మొహమ్మద్’ను ఢిల్లీకి తీసుకెళ్లమని, అక్కడ అతను ఉండటానికి ఓ ఫ్లాటు, కారు ఏర్పాటు చేయమని దేవీందర్ సింగ్ తనకు చెప్పినట్టు అఫ్జల్ గురు లేఖలో తెలిపాడు. అయితే, ఈ కోణాన్ని విచారించిన అధికారులు సాక్ష్యాలు లేవని వదిలేశారు.

2020-01-13

కాశ్మీర్ నుంచి ఇద్దరు ఉగ్రవాదులను ఢిల్లీకి తీసుకొస్తుండగా డి.ఎస్.పి. దేవీందర్ సింగ్ పట్టుబడ్డాడు. ఒకప్పుడు ఇంటరాగేషన్ టేబుల్ కు ఇవతల ఉండి ఉగ్రవాదులను ప్రశ్నించిన సింగ్, ఇప్పుడు ఆ దరికి చేరాడు. ఈ కేసులో ఇంటరాగేషన్ చేస్తున్న అధికారులు అతన్ని అడిగిన మొట్టమొదటి ప్రశ్న ‘‘నువ్వీ పని ఎలా చేయగలిగావు?’’. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఈ ‘ఉగ్రవాద పోలీసు’ గత ఏడాది ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందుకున్నాడు.

2020-01-13
First Page 1 2 3 4 5 Last Page